ఒంగోలు అర్బన్: జరుగుమల్లి 16 నెంబర్ జాతీయ రహదారిపై కారు ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
Ongole Urban, Prakasam | Jun 16, 2026
ప్రకాశం జిల్లా జరుగుమల్లి 16 నెంబర్ జాతీయ రహదారిపై కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో టంగుటూరుకు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ లో గాయపడ్డ వ్యక్తిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.