బేతంచెర్లలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు 799 మంది విద్యార్థులు హాజరు
Dhone, Nandyal | Apr 30, 2025 బేతంచర్లలో పాలీసెట్ 2025 ఎగ్జామ్ కు అధికారులు 4 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షకు జిల్లాలోని నందికొట్కూరు, అవుకు, ప్యాపిలి, డోన్, గుత్తి ఆయా మండలాల నుంచి విద్యార్థులు పాలీసెట్ సెంటర్లకు తరలివచ్చారు.పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు 910 విద్యార్థులకు గాను 799 మంది విద్యార్థులు హాజరై,111 మంది గైర్హాజరైనట్లు బేతంచెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సైలేంద్ర కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షను డిప్యూటీ తహశీల్దారు మారుతి తనిఖీ చేశారు.