సోమాజిగూడలోని ఆల్ఫైన్ హైట్స్ అపార్ట్మెంట్ 5వ అంతస్తులోని ఓ ఫ్లాట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, DRF బృందం తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో ఓ కుక్క పిల్ల చిక్కుకుందని తెలుసుకొని సాహసం చేసి మరీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది