అవుకు: ఆ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి.
అవుకు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పని వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచాలని విద్యాశాఖ అధికారులు చేసిన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ అవుకు మండల గణిత ఉపాధ్యాయులు మంగళవారం ఎంఈఓ శ్రీధర్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అజాం బేగ్ మాట్లాడుతూ.. విద్యా శాఖ అధికారులు ఎవరి ప్రయోజనాలను ఆశించి పాఠశాలల పని వేళలు పెంచుతూ ప్రతిపాదనలు చేస్తున్నారో బహిర్గతం చేయాలన్నారు.