డోన్: బేతంచెర్ల లో పలువురు యువత బిజెపిలో చేరిక
Dhone, Nandyal | Jun 7, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో బిజెపి నాయకులు చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో కొందరు యువకులు బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో ఆదివారం బిజెపిలో చేరారు వారికి జిల్లా అధ్యక్షుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బేతంచెర్ల లో బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించి పట్టణ మండల పదాధికారుల సమావేశం నిర్వహించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మీ లక్ష్యంగా పనిచేయాలని జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు