కర్నూలు: కర్నూలులో పోలీసుల ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మూడవ శనివారం నిర్వహిస్తున్న ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం కర్నూలు జిల్లాలో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగింది.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సబ్ డివిజన్లు, హెడ్‌క్వార్టర్స్, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ల లోపల, ఆవరణలలో చెత్త తొలగించి, పిచ్చి మొక్కలు తొలగించారు.“మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతాం. ఈ రోజు మనం తీసుకునే చర్యలు రేపటి తరాల ఆరోగ్యాన్ని ప్రభావి