కర్నూలు: సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయండి : సిఐటియు జిల్లా కార్యదర్శి అంజిబాబు
విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్న సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. న్యూ సిటీ కార్మిక కర్షక భవన్‌లో న్యూ సిటీ అధ్యక్షుడు వై.నగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అంజిబాబు, నగర కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ —మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వ్యూహరచన కోసం మహాసభల్లో చర్చ జరగనున్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా 2,000 మంది కార్మిక నాయకులు హాజరుకానున్నారని, జనవరి 4న జరిగే మహాప్రదర్శన–బహిరంగ సభను జయప్రదం చేయాలని తె