పోలీసుల ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 80 అర్జీలు వచ్చినట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Apr 6, 2026
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మరియు పోలీస్ అధికారులు “ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి లిఖితపూర్వక అర్జీలతో వారి సమస్యలను ధైర్యంగా జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులకు విన్నవించారు. పోలీసులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వారి ఫిర్యాదుల పూర్వాపరాలను తెలుసుకుని, వాటిని చట్టపరంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.