తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం కరెంట్ ఆఫీస్ సమీపంలో మహిళ మెడలోని బంగారు గొలుసును నిందితులు లాగి దోచుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. బాపూజీ కాలనీ నుండి బొగ్గుల కాలనీకి నడుచుకుంటూ వెళ్తున్న మన్నారు మంగమ్మ (60) ధరించిన మూడు సవర్ల బంగారు సరుడును ఇద్దరు గుర్తు తెలియని నిందితులు KTM (ఎరుపు–నలుపు) బైక్ పై లాగి పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో నెంబర్ ప్లేట్ లేని బైక్ పై, బ్లూ షర్ట్ ధరించిన 25–27 ఏళ్ల వ్యక్తి ముందు కూర్చున్నట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు, సమాచారమున్నవారు CI 9440796360 లేదా SI 9440796361 లకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశా