ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 30వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక
Ongole Urban, Prakasam | Jun 27, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 రోజులపాటు ఈనెల 30వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఋతుపవనాల ఆగమనంతో వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురు గాలులు వీచే అవకాశం అధికంగా ఉన్నాయని ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడతాయని ప్రజలు, రైతులు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.