పలమనేరు: గంగవరం:కల్లుపల్లి పెట్రోల్ బంక్ లో సిబ్బంది చేతివాటం, మోసం చేస్తున్నారు అంటూ ఆరోపించిన ప్రజలు #localissue
గంగవరం: కల్లుపల్లి వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నందు వినియోగదారులు ఆందోళన చేపట్టారు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది పెట్రోల్ పట్టకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ పెట్రోల్ పట్టుకుంటే ఫుల్లుగా పోయారు సగం మాత్రమే పోస్తారని ఆరోపించారు. ఒకవేళ 500 పెట్రోల్ పట్టుకుంటే 250లకు మాత్రమే బల్లలోకి పెట్రోల్ వస్తుంది మిగతా పోయకుండా మోసం చేస్తున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఏదైనా ఇలానే మోసం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఇంత దగా చేస్తుంటే పెట్రోల్ బంక్ యాజమాన్యం కనీసం స్పందించడం లేదని ఆరోపించారు.