ధన్వాడ: క్రీడలు విద్యార్థులకు మానసికోల్లాసం: ఆనంద్ గౌడ్
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం క్రీడలు విద్యార్థులలో మానసి కొల్లాసాన్ని కలిగిస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎస్ జి ఎఫ్ క్రీడల పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ క్రీడలు యువతలో దాగివున్న క్రీడ నైపుణ్యాలను వెలికితిస్తాయని అన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ఆయన సొంత ఖర్చులతో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.