నంద్యాల అర్బన్: ఆత్మకూరులో వైసిపి కార్యాలయం పై దాడి ఘటనపై జిల్లా ఎస్పీని కలిసిన నంద్యాల జిల్లా వైసీపీ నేతలు
Nandyal Urban, Nandyal | Jun 4, 2026
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంపై బుధవారం టిడిపి శ్రేణు లు దాడికి యత్నించిన ఘటనపై వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శిల్ప చక్రపాణి రెడ్డి శిల్పా రవి ఎమ్మెల్సీ ఇషాక్ భాష పలువురు వైసీపీ నేతలు గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ సునీల్, షోరాను కలిశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని కోరారు అలాగే శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు వెన్నుపోటు రెండేళ్లు కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అయితే పరిస్థితులు చల్లబడ్డాక పర్మిషన్ ఇస్తామని ఎస్పీ తెలిపినట్లు కాటసాని తెలిపారు