ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో మాజీ ఎంపీ బుట్టా రేణుక బ్యానర్ ను చించివేసిన దుండగులు, బుట్టా శివనీలకంఠ ఫైర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు!
ఎమ్మిగనూరులో ఉద్రిక్తతకు కారణమైన సంఘటన చోటుచేసుకుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక కార్యాలయానికి ఏర్పాటు చేసిన బ్యానర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో ప్రాంతంలో ఆగ్రహావేశం పెరిగింది. ఈ ఘటనపై YSRCP సీనియర్ నాయకుడు, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివనీలకంఠ ఎమ్మిగనూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ఇటువంటి చర్యలను కఠినంగా పరిగణించాలని డిమాండ్ చేశాడు. రాజకీయ లాభాల కోసం అశాంతి సృష్టించే అశక్త శక్తులను ప్రజలు సమర్థించరని హెచ్చరిస్తూ, CCTV ఫుటేజీలో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలన్నారు