కర్నూలు: కర్నూల్ లో NH 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీ...తప్పిన పెను ప్రమాదం
కర్నూలు నగర పరిధిలోని ఐటీసీ దగ్గర జాతీయ రహదారి (NH-44)పై మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం — ఒక కారు ముందు అకస్మాత్తుగా శునకం అడ్డంగా రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.ఆ కారు వెనకాల వస్తున్న రిజ్జు స్కూల్ బస్సు వేగం తగ్గించేలోపు కారు వెనుక భాగాన్ని ఢీకొట్టగా, ఆ బస్సు వెనకాల వస్తున్న కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల బస్సు కూడా దానిని ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో రహదారి మీద వాహనాలు కొద్ది సేపు నిలిచిపోయాయి.ప్రమాద సమయంలో స్కూల్ టైం కావడంతో రిజ్జు స్కూల్ బస్సులో విద్యార్థులు ఉండటం వల్ల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.