సనప గ్రామములో కార్తీక పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామంలో బుధవారం 8:30 గంటల సమయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సనప గ్రామస్తులు మాట్లాడుతూ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించి ఆలయం వద్ద జ్వాలా తోరణాన్ని వెలిగించడం జరిగిందన సనప గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సనప గ్రామస్తులు చుట్టుపక్కల ప్రజలంతా పాల్గొన్నారు.