అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం లో సోమవారం రాత్రి బైక్ ఢీ కొన్న ప్రమాదంలో దీపక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇందిరా నగర్ కాలనీకి చెందిన వంశీ లైట్ లేని బైక్ లో బయలుదేరినప్పుడు ఇందిర కాలనీ సమీపంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఏటూరి దీపక్ (15) స్కూటర్ ఢీ కొన్నాడు. స్థానికులు గమనించి వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంబెపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.