ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పగులు ఎండలు, రాత్రి అయ్యేసరికి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో ప్రజల అవస్థలు
Ongole Urban, Prakasam | May 29, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పగులు తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయంత్రమేసరికి బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయి. సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారిపోయి బలమైన ఈదురు గాలులతో కూడిన ఉరుములు మెరుపులు పిడుగుల వర్షం కురుస్తుంది. విద్యుత్ సరఫరాతో ప్రజలు ఇబ్బందులకు పడుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.