మర్రిమాకులపల్లి లో అన్నప్రాసన కార్యక్రమంలో పసికందు మృతి
గుర్రంకొండ మండలం మర్రిమాకులపల్లి లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాంతంలో అన్నప్రాసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకోవడంతో ఓ పసికందు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు మర్రిమాకులపల్లికి చెందిన ఓ కుటుంబం పూర్విక్ నాయక్ అనే చిన్నారికి అన్నప్రాసన చేయగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో తల్లిదండ్రులు వెంటనే వాయల్పాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ల పరీక్షించి మెరుగైన వైద్యం కోసం మదనపల్లికి తీసుకెళ్లామనగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ద్రవీకరించారు.