తాడేపల్లిగూడెం: కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఫైర్ అయ్యారు. సూపర్ సిక్స్ అర్థాలు మార్చేశారన్నారు. ప్రభుత్వం అంతా అమరావతి భజన చేస్తుందని విమర్శించారు. మంత్రి నారాయణను మున్సిపల్ శాఖ మంత్రి అనడం కంటే అమరావతి మంత్రి అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించినా సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడలేదన్నారు.