షాద్నగర్ పట్టణంలో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ల ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రిస్టియన్ మైనారిటీ షాద్నగర్ కోఆర్డినేటర్ రవితేజ మాట్లాడుతూ.. క్రిస్టియన్ మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సేవలు ఎంతో విలువైనవన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు ఉంటాయని, పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.