రాయచోటి భద్రకాళి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనం
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఐదవ రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి కటాక్షాలు కురిపించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు అమ్మవారి దర్శనం తీసుకొని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.వి.రమణా రెడ్డి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజూ అమ్మవారు భిన్నభిన్న అలంకారాల్లో దర్శనమిస్తూ భక్తుల మనోభిలాషలు తీర్చుతున్నారని తెలిపారు.