సంతనూతలపాడు: మంగమూరులో పర్యటించిన ఎంపీ కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్
సంక్షేమము అభివృద్ధి రెండు కల్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ తో కలిసి ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. స్థానికంగా సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.