నంద్యాల అర్బన్: నంద్యాలలో మాజీ ఎంపీ ఆవరణంలో పిడుగు
Nandyal Urban, Nandyal | May 7, 2026
నంద్యాల జిల్లాలో పలుచోట్ల బుధవారం సాయంత్రం నుంచి భారీ ఈదురు గాలులతో మోస్తరు వర్షం కురిసింది. ఉయ్యాలవాడలోని మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి స్వగృహం ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది. చెట్టుపైన మంటలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల వారు మంటలను చూసి భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడిన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం ప్రమాదం తప్పిందని తెలిపారు