కావలి: గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన కావలి టీడీపీ నేతలు
కావలి టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మా గుంట పార్వతమ్మ రోడ్ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్ముడు గొప్పతనాన్ని వివరించారు. గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.