నందికోట్కూరు: జూపాడుబంగ్లా సమీపంలోని: నేషనల్ హైవే ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి దుర్మరణం
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా సమీపంలోని నేషనల్ హైవేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, వేగంగా వెళ్తున్న బైకు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు, ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, మృతులు రుద్రవరం మండలానికి చెందిన వారిగా తెలుస్తుంది, నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఎస్సై ఏఎస్ఐలు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు, ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది