పలమనేరు: పెద్దపంజాణి: ఇంటర్ చదివి, క్రికెట్ బెట్టింగ్ యాప్ క్రియేట్ చేసి కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబుని అరెస్ట్ చేసిన పోలీసులు
పెద్దపంజాణి: రూరల్ సిఐ పరశురాముడు మీడియాతో మాట్లాడుతూ, పెద్ద పంజాణి మండలం,రాయలపేటకు చెందిన లక్ష్మీ నారాయణ అదే గ్రామానికి చెందిన చంద్రబాబు తన వద్ద కేబుల్ వ్యాపారం చేద్దామని రెండు లక్షల నగదు తీసుకుని మూడేళ్లయినా పట్టించుకోలేదని పోలీసులకు పిర్యాదు చేయగా,విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చంద్రబాబు సొంతంగా క్రికెట్ బెట్టింగ్ యాప్ సృష్టించి కుటుంబ సభ్యులు, ఇతరుల పేరుమీద బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటి ద్వారా బెట్టింగ్ డబ్బులు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. లక్ష్మీ నారాయణ అనే వ్యక్తిపై కూడా అతనికి తెలియకుండా బ్యాంకు ఖాతా తెరిచి కోటి రూపాయలు పైగా లావాదేవీలు నిర్వహించాడు.