గుంతకల్లు: గుత్తిలో కోర్టు వాయిదాకు హాజరైన సినీ నటుడు రాజ్ కుమార్, సన్మానించిన టీడీపీ నాయకులు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోర్టులో వాయిదాకు సినీ నటుడు రాజ్ కుమార్ హాజరయ్యారు. 2009 ఏప్రిల్ నెలలో సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సినీ నటుడు రాజ్ కుమార్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని గుత్తి పట్టణంలోని హైవేలో రోడ్ షో చేశారు. రోడ్డు షోలో సినీ నటుడు రాజ్ కుమార్ పాల్గొని ప్రచారం చేశారు. అయితే అనుమతి లేకుండా హైవేలో రోడ్డు షో చేసినందుకు ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా సినీ నటుడు రాజ్ కుమార్ బుధవారం గుత్తి కోర్టులో ఉన్న కేసు వాయిదాకు హాజరయ్యారు.