తాడేపల్లిగూడెం: ఎమ్మెల్యే శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరిన జగ్గన్నపేటకు చెందిన 100 మంది
తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటకు చెందిన 100 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఆదివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే జనసేన పార్టీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ నిధులను పప్పు బెల్లాలుగా పంచిపెట్టారని విమర్శించారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని విమర్శించారు.