స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ
Ongole Urban, Prakasam | May 8, 2026
స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ నీ శుక్రవారం పార్టీ అధ్యక్షుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి స్థానం కల్పించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి కీలక కమిటీలో స్ధానం కల్పించటాన్ని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నేతలు మరియు మాజీ మంత్రి బాలినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పార్టీ లో చేరిన బాలినేని కి కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.