సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం లో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, ఇద్దరు అరెస్ట్
నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామ శివారులలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై రజియా సుల్తానా పోలీస్ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఇద్దరిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.10,110 లు నగదు తోపాటు, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లను ఎస్సై స్వాధీనం చేసుకున్నారు. మండలంలో పేకాట శిబిరాలు, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.