కొత్తగూడెం: సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు శిక్షణ తరగతులు
కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో ఎంపిటిసి, జడ్పిటిసి సాధారణ ఎన్నికలు 2025 కు సంభందించి ఆర్వో లకు, ఏ ఆర్వో లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పై సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కలిపించారు. ఈసందర్భంగా అడిషినల్ కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ.... ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ ఆఫ్ ఎలక్షన్ జరిగేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల నిర్వహణ, విధానం పై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు..