కార్వేటినగరం తహసిల్దార్ నాగరాజు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం ఎర్రమరాజుపల్లి వద్ద సర్వే నంబర్ 63లో 76.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని సమాచారం అందడంతో, తహసిల్దార్ ఆదేశాల మేరకు ఆ ప్రదేశంలో ఆదివారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ భూమిని శ్మశానవాటికతో పాటు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేటాయిస్తామని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.