ఒంగోలు అర్బన్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేలా పనిచేస్తా: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
Ongole Urban, Prakasam | May 31, 2026
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేలా పనిచేస్తానని మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఒంగోలు పట్టణంలో కార్యకర్తలతో సమావేశమైన బాలినేని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలోకి పలువురిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించానని కానీ అప్పుడు కుదరలేదని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్దామని జనసైనికులకు తెలిపారు.