కావలి: కావలిలో నూతన మిషన్లు ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్...
కావలి పాత కంపోస్ట్ డంపింగ్ యార్డ్లో కంపోస్ట్ ఎరువు తయారీ కోసం నూతన మిషన్లను కొనుగోలు చేశారు. వీటిని మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. చాంపింగ్, సీవింగ్ మిషన్లను కొనుగోలు చేసినట్లు చెప్పారు. కొబ్బరి బోండాలు, అరిటి గెలలను సులభంగా ఈ యంత్రాల సాయంతో క్రష్ చేసుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.