రాప్తాడు ఆటోనగర్ లో బిల్డింగ్ పనులు చేస్తూ విద్యుత్ షాక్ తగిలి కురుగుంట గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ మృతి
Anantapur Urban, Anantapur | Oct 21, 2025
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఆటోనగర్ లో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కురుగుంట గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ వెల్డింగ్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బాబా ఫక్రుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన పైన రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అదేవిధంగా సిఐటియు ఉపాధ్యక్షుడు రామాంజనేయులు మృతి చెందిన బాబా ఫక్రుద్దీన్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి సిఐటియు ఉపాధ్యక్షుడు రామాంజనేయులు విజ్ఞప్తి చేశాడు.