అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాల క్రీడా మైదానంలో సోమవారం కళ్యాణదుర్గం డివిజనల్ మహిళ ఉపాధ్యాయినిల త్రోబాల్ పోటీలు పోటా పోటీగా సాగాయి. ఈరోజు కే.జీ.బీ.వీ, బెలుగుప్ప నందు జరిగాయి ఈ త్రోబాల్,టోర్నమెంట్ కు కళ్యాణదుర్గం డివిజన్ లో ఏడు మండలాలు పాల్గొన్నాయి. ఈ త్రోబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పెద్దన్న, టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జునలు కేజీబీవీ ఎస్ ఓ నాగరత్న, బెలుగుప్ప పీడీ గోపాల్ రెడ్డి లతో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ త్రోబాల్ ఫైనల్ పోటీల్లో గెలిచిన హిరేహాల్ మండలం జట్టు జిల్లాస్థాయిలో జరిగే పోటీలకు అర్హత సాధించింది.