పశు పోషకులకు అధిక ప్రాధాన్యత ఇస్తాం: సత్యవాడలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం కే.గంగవరం మండలం సత్యవాడలో పర్యటించి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు ఆరోగ్య వైద్య శిబిరాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.