మాచారెడ్డి: లచ్చపేటలో దుర్గామాత అమ్మవారికి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన చేసిన భక్తులు
మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలో గురువారం దుర్గామాత మండపం వద్ద భక్తులు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారు నాల్గవ రోజు కాత్యాయనీ దేవి రూపంలో దర్శనం ఇవ్వగా, శోభాయ మానంగా అమ్మవారిని మండపం నిర్వాకులు అలంకరించారు. ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కలు తీర్చుకున్నారు.