ఒంగోలు అర్బన్: ఒంగోలు ఆర్టీసి డిపో సమీపంలో ఒక లాడ్జిలో అందురాలు దారుణ హత్య
Ongole Urban, Prakasam | May 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ లాడ్జిలో అంధురాలు దారుణ హత్యకు గురైంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న అంధురాలు ఆదిలక్ష్మి ని దారుణం గా గొంతు కోసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అంధురాలు దారుణ హత్య ని నిరశిస్తూ లాడ్జి ఎదుట అంధులు ఆందోళన కి దిగారు. ఒంగోలులోని ఎన్జీవో కాలనీ కి చెందిన ఆదిలక్ష్మి ఇరిగేషన్ కార్యాలయంలో అటెండర్ గా పని చేస్తోంది. అయితే నిన్నటి నుండి ఆదిలక్ష్మి కనిపించడంలేదని ఆమె భర్త మల్లిఖార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.