వేతనాలు వెంటనే విడుదల చేయాలంటూ నంద్యాల కలెక్టరేట్ ముందు వివోఎల నిరసన
Nandyal Urban, Nandyal | Apr 27, 2026
వార్షిక వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నంద్యాల కలెక్టరేట్ వద్ద వివోఏలు నిరసన తెలిపారు. ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి తిరుపతయ్య మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు, హెచ్ఐర్ పాలసీ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల వెంకట్ పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు