నందికోట్కూరు: గోకవరం గ్రామంలో పశువులకు మేతగా మొక్కజొన్న పంట
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా లేక నీటి సదుపాయం లేక మొక్కజొన్న పొలాలు ఎండిపోతున్నాయి, గ్రామానికి చెందిన మల్లారెడ్డి సాగు చేస్తున్న మొక్కజొన్న పంట ఎదుగుదల నిలిచిపోయింది, చేసేదేమీ లేక పంటలను పశువులకు మేతగా వేస్తున్నాడు, సీజన్ ప్రారంభంలో కాస్త వర్షం పడటంతో ఏడెకరాల్లో రెండు లక్షలు పెట్టుబడితో మొక్కజొన్న వేశారు, తాను నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు మల్లారెడ్డి కోరారు