నందికోట్కూరు: ఇంధన పొదుపు పై ఎమ్మెల్యే గిత్త జయసూర్య బైక్ పై అవగాహన: ఇంధన పొదుపులో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపు
నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఇంధన వాడకం తగ్గించాలని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య పిలుపునిచ్చారు, శనివారం ఆయన ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ అల్లూరు గ్రామం నుంచి కాన్వాయ్ లేకుండా బైక్ పై నందికొట్కూరుకు చేరుకొని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించి ఇంధన పొదుపులో భాగస్వామ్యం కావాలని కాలుష్యం అరికట్టాలని ప్రజలకు సూచించారు