కర్నూలు: తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ... కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన
మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించాలి : డివైఎఫ్ఐ కర్నూలు పట్టణ పరిసర గ్రామమైన ఉల్చాలలో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా ఆరోపించారు. ఈ సందర్భంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట డివైఎఫ్ఐ మండల నాయకుడు అంజి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాఘవేంద్ర, అబ్దుల్లా మాట్లాడుతూ... కర్నూలు జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉల్చాలలో పదివేల మంది జనాభా ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. 10–15 రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు