అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పటాన్ చెరు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఇస్నాపూర్ X రోడ్ వద్ద వాహన తనిఖీలో GJ 03 BV 9952 నంబర్ లారీని సివిల్ సప్లైజ్ డిప్యూటీ తహసీల్దార్ అనూప్ దేవానంద్ తో కలిసి తనిఖీ చేయగా, లారీ లోపల ప్రభుత్వ రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ యజమాని జయవీర్, డ్రైవర్ నారాబాయి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.