నంద్యాల అర్బన్: "వన్ మంత్ -ఫోర్ విజిట్ "తో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు,ఆళ్లగడ్డలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన కలెక్టర్
Nandyal Urban, Nandyal | May 15, 2026
వన్ మంత్- ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారుల ఆదేశించారు.శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులు ఫిర్యాదులు సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరించారు