నంద్యాల అర్బన్: నంద్యాల మున్సిపల్ హైస్కూల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 13, 2026
నంద్యాల గుర్సాలపేట కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్లో సాగుతున్న పదో తరగతి రెమిడియల్ తరగతులను కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి చదువుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్తో సమావేశమై బోధన విధానం, హాజరుపై సమీక్షించారు. ఫలితాల మెరుగుదలకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు.