ఒంగోలు అర్బన్: ఘనంగా ఎన్టీ రామారావు 103 వ జయంతి వేడుకలు.
Ongole Urban, Prakasam | May 28, 2026
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్.టి.రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి మరియు పార్టీ కార్యాలయం నందు విగ్రహాలకు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయకుమార్, పార్టీ పరిశీలుకులు DR శివ ప్రసాద్ , Dr.సీతారామయ్య ముప్పవరపు సుచిత్ర మరియు పార్టీ నాయకులతో కలసి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేకును కట్ చేసి పంచిపెట్టారు.