డోన్: డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమైన ఖరీఫ్ పంటల సాగు
Dhone, Nandyal | Jun 9, 2026 నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం లోని డోన్,ప్యాపిలి, బేతంచెర్ల పట్టణంతోపాటు ఆయా గ్రామాల్లో అడపాదడప వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు ఖరీఫ్ పంటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఏడాది జూన్ నెల ప్రారంభం నుంచి మండలంలో వర్షాలు పడుతుండటంతో రైతన్నలు కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న, సజ్జ పంటలను సాగు చేస్తున్నారు. దీంతో పంట పొలాల్లో కాడెద్దులు, వ్యవసాయ కూలీల సందడి కనిపిస్తుంది.