రుద్రంగి: విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది: రుద్రంగిలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
విద్య వైద్యం పై సీఎం రేవంత్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలో నిర్మిస్తున్న 30 పడగల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులను స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక కోటి 43 లక్షల రూపాయలతో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆస్పత్రి పూర్తయి వినియోగంలోకి వస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.